Thursday, 5 November 2026

సధ్భావన యాత్ర ప్రారంభించిన టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని మాల్కాజ్‌గిరిలో తెలంగాణ రాజకీయ జేఏసీ సద్భావన యాత్ర ప్రారంభించింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీఆర్‌ఎల్డీ, ఉద్యోగసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మాయుల్లా కలిసుందాం అని నినాదాలు చేశారు. యాత్ర ప్రారంభంలో జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై ఎవరు వెనక్కి పోయినా వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *