హైదరాబాద్,(జనంసాక్షి): పది రోజుల్లో కాల్చి చంపుతామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వచ్చిన బెదిరింపు లేఖను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మకు టీఆర్‌ఎస్ నేతలు అందించారు. ఎల్‌ఈటీ ఆంధ్రా నక్సల్స్ పేరుతో గత రాత్రి తెలంగాణ భవన్‌కు లేఖ వచ్చిన విదితమే. లేఖపై దర్యాప్తు జరపాలని సీపీని టీఆర్‌ఎస్ నేతలు కోరారు.




