Tuesday, 3 November 2026

బాబు పక్కా ఆంధ్రా పక్షపాతి: ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకోవడం కోసం చంద్రబాబు మూర్ఖపు ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పక్కా ఆంధ్రా పక్షపాతి అని పేర్కొన్నారు. బాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వెకిలి మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. తన రాజకీయ భవిష్యత్‌పై భయపడే బాబు తెలంగాణ విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు అని మండిపడ్డారు. తెలంగాణ టీడీపీ నేతలు ఇకనైనా పార్టీని వీడి బయటకు రావాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *