హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఈ రోజు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమవుతున్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ సమీపంలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరుగబోతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దీనికి హాజరవుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఎలా స్పందించాలి? అనే అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలు కూడా ఇందులో చర్చించనున్నారు.




