హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత మంత్రులు ఈ రోజు మంత్రుల నివాస సముదాయంలోని మినిస్టర్స్ క్లబ్లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు వీరు సమావేశం కానున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల భవితవ్యంపై వస్తున్న అపోహలు, ఆందోళనలను తొలగించి వారికి భరోసా కల్పించే విషయమై ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నట్లు తెలిసింది.




