హైదరాబాద్,(జనంసాక్షి): విద్యుత్ రంగంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల నిరసన సభలో ప్రొఫెసర్ కోదండరాం, విఠల్, దేశపతి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణి, బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుఊ సమైక్యవాదమంటూ సీమాంధ్రులు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో మాత్రమే జరిగే ఉద్యమాన్ని సమైక్య ఉద్యమమని ఎలా అంటారు అని ప్రశ్నించారు.




