హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రకటనపై తమకు ద్వంద్వ వైఖరి లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తమపై నిందలు వేస్తే టీజీ వెంకటేష్, లగడపాటి రాజగోపాల్‌కు నోట్లో నాలుకలుండవు అని అన్నారు. భవిష్యత్‌లో పొత్తులపై టీడీపీ కి నరేంద్ర మోడీ కన్ను కొట్టి వెళ్లారు అని విమర్శించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్, బీజేపీతో సీపీఐకి పొత్తులుండవు అని స్పష్టం చేశారు.




