హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌సౌధలో విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులది ఉన్మాద ఆందోళనలు అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమం చాన్నాళ్ల ఉద్యమం అయితే సీమాంధ్ర ఉద్యమం చానళ్ల(మీడియా) ఉద్యమం అని తెలిపారు. వంద సీమాంధ్ర చానళ్లు వచ్చినా తెలంగాణను ఆపలేరు అని తయన తేల్చిచెప్పారు. సీమాంధ్ర చానళ్ల ప్రసారాలను చూసి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఆయన తెలిపారు.




