Thursday, 5 November 2026

సీట్ల కోసమే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనకు ఒప్పుకుంది : నరసింహరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదనే భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ విభజకు అంగీకరించిందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహరెడ్డి హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి నాయని అనంతరం ప్రసంగించారు. సీట్ల కోసమే కాంగ్రెస్‌ విభజనకు ఒప్పుకుందని ఆయన తెలిపారు. ఆయితే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌కు ఎలాంటి క్రెడిట్‌ దక్కదని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *