Thursday, 5 November 2026

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. స్వతంత్య్ర సమరయోధులకు పింఛను రూ. 4 వేల నుంచి రూ. 7 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని అంకితభావంతో అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిజాయతీ, పారదర్శకమైన పాలన ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *