హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుపై తిరుపతి అలిపరిలో సీమాంధ్ర గుండాలు దాడి చేయడాన్ని ఓమూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కలిసుందామనే వాళ్ల నీతి ఇదా అని జేఏసీ విద్యార్థులు ప్రశ్నించారు. మరోసారి తెలంగాణ నేతలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.




