హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడవచ్చని వస్తున్న వదంతులకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెరదించారు. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.




