Thursday, 5 November 2026

విద్యుత్‌ సౌధలో టీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ ప్రాంగణం జైతెలంగాణ నినాదాలతో హోరెత్తుతుంది. ఇవాళ లంచ్‌& విరామ సమయంలో విద్యుత్‌సౌధ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. కార్యాలయం ప్రాంగణంలో వాళ్లు జై తెలంగాణ నినాదాలు చేశారు. పార్లమెంట్‌ వెంటనే  తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి మీడియాను పోలీసు అనుమతించలేదు. దీంతో పోలీసులకు విలేకరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *