Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెం : కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన విద్యుత్‌సౌధ వద్ద జరిపిన విద్యుత్‌ శాఖ తెలంగాణ ఉద్యోగులు చేసిన ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. హైదరాబాద్‌ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎంఐఎం కూడా ఊర్కోదని ఆయన తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం చేస్తే తమతో కలిసి ఉద్యమిస్తామని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *