Tuesday, 3 November 2026

తెలంగాణకు ఒక చట్టం, ఆంధ్రాకు ఒక చట్టమా? : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రాష్ట్రంలో రెండు చట్టాలు ఉన్నాయా? అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అరెస్టు చేశారని, మరిప్పుడు సమైక్యాంధ్ర అంటూ ఆమరణ దీక్షకు దిగిన వైఎస్‌ విజయలక్ష్మి ఎందుకు అనుమతినిచ్చారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఒక చట్టం, ఆంధ్రాకు ఒక చట్టమా అని ఆయన నిలదీశారు. ఈ విషయంపై డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *