దుండిగల్ : ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు పదోతరగతి విద్యార్థునులు అదృశ్యమైన సంఘటన రంగారెడ్డి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం దుండిగల్‌కు చెందిన స్నేహసదన్ అనాధశ్రమంలో భారతీదేవి ఉంటున్నారు. అనాధాశ్రయంలో ఉంటూ మియాపూర్ లోని కొలంబస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. సోమవారం యధావిధిగా తోటి విద్యార్ధినులతో కలిసి పాఠశాలకు వెళ్లిన వీరు తిరిగిరాలేదు. ఆశ్రమ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




