హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తక్షనమే ఔట్ సోర్సింగ్ టెంగర్‌ను రద్దు చేయాలంటూ కాంట్రాక్టు ఉద్యోగులు యూనివర్సీటీలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఓయూలోని చీఫ్ వార్డెన్ కార్యాలయం నుంచి పరిపాలన భవనం వరకు ప్రదర్శనగా వెల్లారు. హాస్టల్ ఉద్యోగులందరిని పీఎఫ్, ఈఎస్‌ఐలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. యూనివర్సీటీలో పనిచేస్తున్న ఒప్పందం ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.




