హైదరాబాద్,(జనంసాక్షి): తండ్రి సమైక్య రాజీ’డ్రామా’ ప్రభావం తనయుడిపై పడింది. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణపై తన వైఖరిని ప్రకటించాలని ఓయూ, కేయూ జేఏసీలు డిమాండ్ చేశాయి. లేకుంటే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనీయబోమని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ఎన్టీఆర్ ఆండ్రి హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆమోదింప జేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ విద్యార్థులు ఎన్టీఆర్‌పై విరుచుకుపడ్డారు.




