హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కనుసైగతోనే ఏపీ ఎన్టీవోలు ఆందోళలనకు దిగి సీమాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు నీళ్లు, ఉద్యోగాలు రావని తప్పుడు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాడని ఆయన విమర్శించారు. సీఎం తీరుతోనే రాష్ట్రం తగులబడుతుందన్నారు.




