Tuesday, 3 November 2026

ముంబాయిలో ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం

ముంబాయి: ముంబాయిలో దారుణం జరిగింది. మధ్య ముంబాయిలోని పారెల్‌ ఏరియాలో ఓ మహిళ ఫోటో జర్నలిస్టు(పై(23)పై దుండగులు దాడి చేశారు. గురువారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఓ ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌లో ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె విధినిర్వహణలో భాగంగా గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో పారెల్‌ ఏరియాకు వెళ్లారు. అప్పటికే అక్కడున్న ఐదుగురు నిందితలు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనను అడ్డుకోబోయిన స్నేహితుడు పై కూడా దుండగులు దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ముంబాయిలోని జాస్‌లాక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంభందించి ఇప్పటి వరకు 10మందిని అదునులోకి తీసకుని విచారిస్తున్నారు. జాస్‌లాక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు స్నేహితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఇప్పటికే నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *