Tuesday, 3 November 2026

రేపు తెలంగాణ కవుల యాక్షన్‌ ప్లాన్‌ : గౌరీశంకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టాలని, హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్లలో కవులు , రచయితలు యాక్షన్‌ప్లాన్‌ రూపొందించనున్నారని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వెయ్యిమంది త్యాగంతో, కోట్లాది మంది ఆకాంక్షలతో సుధీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారని, ఈ న్యాయబద్ధమైన డిమాండ్‌కు అడ్డుతగలడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాతే రాజకీయ పార్టీలు తెలంగాణ ఎంత విషం కక్కుతున్నదీ తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తూనే ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *