హైదరాబాద్,(జనంసాక్షి): జైల్లో జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో చెప్పాలని టీఆర్‌ంఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు డిమాండ్ చేశారు. లక్ష కోట్లు ప్రజాధనం దోచుకున్నది చాలక ఇంకా దోచుకునేవదుకు అవకాశం ఇవ్వమని దీక్ష చేస్తున్నట్లు ఉన్నదని హరీష్ ఎద్దేవా చేశారు. లక్షలాది సీమాంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటే సీమాంధ్ర పెట్టుబడిదార్లే సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదన్నారు. ఇకనైనా సీమాంధ్ర ఉద్యోగులు విచక్షణతో ఆలోచించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలన్నారు.




