Tuesday, 3 November 2026

మా గడ్డపై మమ్మల్నే అరెస్టు చేస్తారా ? : బాల్క సుమన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను తమ గడ్డపైనే అరెస్టు చేస్తారా అని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. సీమాంధ్రలో విధ్వంసాలకు పాల్పడుతున్న ఆందోళనకారులను వదిలేసి, శాంతి ర్యాలీ చేస్తున్న టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సీమాంధ్రులకు పోలీసులు ఎస్కార్‌గా ఉండి అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. అరెస్టులకు నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *