హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు శాంతి ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు తమ నిరసన కొనసాగిస్తామని తెలంగాణ ఉద్యోగులు తేల్చి చెప్పారు. జై తెలంగాణ నినాదాలతో సచివాలయం హోరెత్తుతుంది. తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల ర్యాలీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.




