హైదరాబాద్,(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టమైన మాట ఇచ్చారని, ఆ మాటకు తిరుగులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించిన సోనియాకు ఈ సందర్భంగా గీతారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర ప్రజలతో సంయమనంతో, స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నామని గీతారెడ్డి తెలిపారు.




