హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట మార్చిన టీడీపీ, వైసీపీల తీరుపై తెలంగాణ మంత్రులు ఖండిస్తు తీర్మాణం చేశారు. ఇవాళ మంత్రి గీతారెడ్డి నివాసంలో సమావేశమైన టీ మంత్రులు పలు తీర్మాణాలు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ పది జిల్లాలు కావాలని మొదటి తీర్మాణం, సీడబ్ల్యూసీ తీర్మానాన్ని స్వాగతిస్తూ, ఊరూఆ కాంగ్రెస్ జెండావిష్కరణ చేయాలని తీర్మాణం చేశారు.




