Monday, 2 November 2026

వ్యాన్‌ బోల్తా: ఆరుగురి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి డీసీఎం బోల్లా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా దేవేరకొండ మండలం కేశ్యాతండా వాసులు. 20 మంది బత్తాయి కూలీలు పీఏపల్లికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *