హైదరాబాద్,(జనంసాక్షి): ఆసుపత్రిలో జగన్‌తో పాటు తాము కూడా ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్ తల్లి విజయమ్మ సతీమణి భారతి దాఖలు చేసిన మెమోను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది. చంచల్‌గూడ జైల్లో జగన్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.




