ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జ్
దక్షిణాఫ్రికా,(జనంసాక్షి): దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రిటోరియా ఆస్పత్రిలో సుదీర్ఘకాలం పాటు చికిత్స పొందిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. దీంతో మండేలా ఆస్పత్రి నుంచి తన నివాసానికి చేరుకున్నారు.