విభజనకు సహకరించండి : కోదండరాం

దిలావర్‌పూర్‌, అదిలాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన కోసం సీమాంధ్ర నాయకులు, ప్రజలు సహకరించాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం కోరారు. మంగళవారం జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రమైన కదిలి పాపహరేశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నాయకులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ బిల్లు పెట్టేవరక బత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజయ్‌కుమార్‌, కట్టా శేఖర్‌, రామ్మోహన్‌, భాజపా నాయకులు రావుల రాంనాథ్‌, రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు.