హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చేస్తామంటే ఎవరినైనా తరిమికొడ్తామని సచివాలయ టీ ఉద్యోగులు హెచ్చరించారు. ఇవాళ సచివాలయంలో టీ ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. తమ సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సభ పెట్టడం హైదరాబాద్ మీద దాడిగానే భావిస్తున్నామని తెలిపారు. బతుకుదెరువు కోసం వచ్చి ఉద్దరిచ్చినమని మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. పుణె, బెంగుళూరు కూడా అభివృద్ధి చెందాయి.. అవికూడా సీమాంధ్రులే అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు.




