పొలంలో మందు జల్లి కూలీ మృతి
రేంజర్ : పొలంలో మందులు జల్లిన అనంతరం అస్వస్థతకు గురై ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలంలోని తాడ్‌బిలోలి పంచాయతీ పరిధిలో మౌలాలీ తండాకు చెందిన రమేశ్(30) వరి పొలంలో గుళికల మందు చల్లిన అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఒక రైతు పొలానికి అరుగురు కూలీలు మందు చల్లేందుకు వెళ్లారు. మందు చల్లి ఇంటికి చేరుకున్నాక అందరూ అనారోగ్యానికి గురయ్యారు వీరిలో రమేశ్ మృతి చెందగా మరో ఐదుగురిని సంబంధీకులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.