సికింద్రాబాద్ : కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా విజయవాడ మీదుగా భువనేశ్వర్ – తిరుపతిల మధ్య వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 14 నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (నె. 22879) అన్ని శనివారాల్లో తిరుపతి నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (22880) అన్ని ఆదివారాల్లో బయల్దేరుతుందని ఆయన ప్రకటించారు.




