Tuesday, 3 November 2026

అక్టోబరులో సౌర విద్యుత్‌ పరికరాల ప్రదర్శన

హైదరాబాద్‌ : అక్టోబరు మూడు నుంచి ఐదో తేదీవరకు హైటెక్స్‌లో సౌర విద్యుత్‌ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్యాప్సి అధ్యక్షుడు దేవేందర్‌ సురానా చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడకుండా సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వాడకానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. సౌరశక్తి వాడకం తప్పనిసరైందని అందువల్లే ఫ్యాప్సి దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పరిశ్రమలు సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తే 50 శాతం రాయితీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు నెడ్‌క్యాప్‌ ఎండీ కమలాకర్‌బాబు చెప్పారు. నెట్‌ మీటరింగ్‌ విధానం అమలులోకి తీసుకురావడానకి భవన పైకప్పులపై సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 75 ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను సౌర విద్యుత్‌ ప్రదర్శనకు తీసుకొస్తున్నట్లు కమలాకర్‌బాబు చెప్పారు. సౌర విద్యుత్‌ పరికరాల ప్రదర్శన లోగోను ఆయన ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *