హైదరాబాద్ : సేవ్ ఆంధ్రప్రదేశ్ సమావేశాన్ని ముగించుకుని వెళ్తోన్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి జరిగింది.ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయని తెలుస్తుంది.ఇవాళ అబ్దుల్లాపూర్‌మెట్ ,హయత్‌నగర్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.సమైక్య సభలో తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ,నగరంలో తెలంగాణవాదులపై దాడులకు పాల్పడడం వంటివి జరుగడంతో తీవ్ర ఉద్విగ్నతకు లోనైన తెలంగాణవాదులు దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు.




