సిరియాపై పరిమిత దాడి జరపాల్సిందే: ఒబామా
వాషింగ్టన్ : సిరియాపై పరిమిత దాడి అవసరమని అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా పునరుధ్ఘాటించారు.ఆ దేశ ప్రజలపై ప్రభుత్వం జరిపిన రసాయనిక దాడి పట్ల స్పందించకుండా ఉండలేమన్నారు.అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసే వారాంతపు ప్రసంగంలో ఒబామా శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.రసాయనిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే … అమెరికాకు కూడా తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని ఒబామా హెచ్చరించారు.