శ్రీశైలం ఆలయం , : శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి ఈనెల 18వ తేది వరకు గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఆజాద్ తెలిపారు. అక్కమాహాదేవి అలంకార మండపంలో అయిదడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతికి ,సాక్షి గణపతికి వ్రతకల్ప అర్చనలు ..18వ తేదిన ఉదయం గణపతిపూజ ,మండపారాదన ,రుద్రహవానాలు,జయదిహోమం, పూర్ణాహుతి ,కలశోద్వాసన తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.గణపతి నవర్తాత్రుల్లో ఆర్జిత ఉభయం రూ.2,516 చెల్లించి భక్తులు సేవాకర్తలుగా ఉత్సవ సేవల్లో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు.




