హైదరాబాద్ : గుండెలు మండి జైతెలంగాణ అంటే తమ బిడ్డలపై దాడి చేస్తారా అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.జైతెలంగాణ నినాదాలు చేస్తే తప్పేంటి ఆయన సీమాంధ్రులను ప్రశ్నించారు.తెలంగాణ నడి గడ్డమీద జైతెలంగాణ నినాదాలు చేసే స్వేచ్చ తమకు లేదా అని ఆయన అడిగారు.తెలంగాణ నడిగడ్డపై జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తే లేని తప్పు తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో ,తెలంగాణ గడ్డమీద అంటే తప్పా అని ఆయన అన్నారు.జైతెలంగాణ అన్నందుకు కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్, ఓయూ విద్యార్ధినేత బాలరాజ్ యాదవ్ ను సీమాంధ్ర గుండాలు ,ప్యాక్షనిస్టులు చితకబాదిన్రు అని ఆయన సీమాంధ్రులపై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.తెలంగాణ గడ్డపై తెలంగాణలో తెలంగాణ వాదులపై దాడులు జరుగుతుంటే ఎందుకు కలిసుండాలని ఆయన అన్నారు.
జైతెలంగాణ అంటే దాడి చేస్తారా? : టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల





