హైదరాబాద్ : హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం అన్నారు.హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆదివారం నగరంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ హైటెక్ సిటీ అభివృద్దిలో తెలంగాణ ప్రాంతం వారికి స్థానం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.




