Tuesday, 3 November 2026

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన అసన్న (40)అనే రైతు అప్పుల భాద తాళలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తనకున్న ఐదెకరాల పొలంతో పాటు నాలుగు ఎకరాలు కౌవులుకు తీసుకున్న ఆసన్న వ్యవసాయం చేస్తూ పంట వేశాడు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోయి తీవ్రంగా నష్టం వచ్చింది. దీంతో అప్పు చేసి పెట్టుబడి ఆరుగాలం కష్టపడి వేసిన పంట నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులు పెరిగి అప్పులే మిగిలాయి. దీంతో చేసేదేమి లేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆసన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు తెలిపారు.మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *