Tuesday, 3 November 2026

అధిష్టానం నిర్ణయాన్ని సీఎం ఎలా ధిక్కరిస్తారు.: భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి

భువనగిరి : తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత సీఎం ఆనిర్ణయాన్ని ఎలా ధిక్కరిస్తారని భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.నల్గొండ జిల్లా భువనగిరిలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు సోనియా నిర్ణయాన్ని ధిక్కరించడం సమంజసమా? అని ఆయన ప్రశ్నించారు.సీఎం పదవి ఇచ్చిన పార్టీకి అన్యాయం చేస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *