Tuesday, 3 November 2026

న్యూజిలాండ్‌ ‘ఎ’పై భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

హైదరాబాద్‌ : విశాఖపట్నం లోని వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వీసీఏ- వీడీసీఏ స్టేడియంలో జరిగిన అనధికారిక వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ‘ఎ’పై భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టు 49.4ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన భారత ‘ఎ’జట్టు 44.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప (103) ,ఉన్ముక్త్‌ చాంద్‌ 94) పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *