Tuesday, 3 November 2026

పెన్‌గంగాకు జాతీయ హోదా కల్పించండి

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13 : ఆదిలాబాద్‌ సరిహద్దులో గల పెన్‌గంగా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి జాతీయ హోదా కల్పించాలని మాజీ మంత్రి  జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రులు నటరాజన్‌, శరద్‌పవార్‌లను కలిసి వినతిపత్రాలు అందజేశారు.ఈ ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్‌, బేల మండలాలకు చెందిన వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ ఇక్కట్లను తొలగించి జాతీయ హోదా కల్పించాలని కోరుతూ పనులను వేగవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *