Tuesday, 3 November 2026

ఐటీడీఏ అధికారి తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13 : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వ్యవహారతీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు చేపట్టే నిరసన కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనవద్దని జీవో జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ఐకాస నేతలు అభ్యంతరం తెలిపారు. విద్యార్థి సంఘాలకు సంక్రమించిన హక్కులను కాలరాసే విధంగా అధికారి వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. విద్యార్థి సమస్యలతో పాటు హక్కుల పరిరక్షించటానికి విద్యార్థి సంఘాల బాధ్యత అని, దానితో పాటు అధికారుల అవినీతి నిర్లక్ష్య వైఖరి, విద్యారంగ సంక్షేమానికి .. ఆదేశించడం భావ ప్రకటనను భారత రాజ్యాంగ ప్రకారం కల్పించిన హక్కులను కాలరాయడమేనని వారు ఆరోపించారు. సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రభుత్వం కల్పించిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయవద్దని వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాల ఐకాస కన్వీనర్‌ వెంకటనారాయణ, సందీప్‌, రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *