Tuesday, 3 November 2026

తెలంగాణపై కాంగ్రెస్‌ మాట తప్పితే పుట్టగతులుండవ్‌

సీపీఐ శాసనసభ పక్ష నేత గుండా మల్లేష్‌

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇచ్చిన మాటను తప్పితే మరో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సీపీఐ శాసనసభ పక్ష నేత గుండా మల్లేష్‌ హెచ్చరించారు. సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాధనం కోసం ఎన్నో ఉద్యమాలు 1200మంది యువకులు బలిదానాల ఫలితంగా సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకుంటే ఎందుకు వ్యతిరేకంగా సీమాంధ్రంలో రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి కృత్రిమ ఉద్యమాలు చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు, ఉద్యోగులు వాస్తవాలను గ్రహించి సందేహాలను నివృత్తి చేయాలని ఆయన సూచించారు. నిర్ణయం వెలువడిన తర్వాత ఉద్యమాలు చేస్తే అభివృద్ది కుంటుపడడం తప్ప సాధించేదేమి లేదన్నారు. ఒకవేళ కేంద్ర ం తన నిర్ణయాన్ని అమలు చేయకపోతే తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేస్తామని ఆయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *