Tuesday, 3 November 2026

యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నా : బేపీ

హైదరాబాద్‌ : ఆందోళనల కారణంగా ‘తెలుగుతేజం’ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నానని లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. అనంతపురంలో జేపీ చేపట్టిన యాత్రను రెండో సారికూడా సమైక్యవాదులు అడ్డుకున్నారు. అంతకు ముందు జేపీ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టినంత సులువుగా కర్ణాటక, తమిళనాడును విడగొట్టే ధైర్యం కేంద్రానికి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సామంతరాజుల్లా చూడటం ఢిల్లీపెద్దలు మానుకోవాలన్నారు. ఆంటోని కమీటీ స్థానంలో జాయింట్‌ పార్ల మెంటరీ కమిటీ, ప్రభుత్వ కమిటీలను వేయాలని జేపీ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *