హైదరాబాద్: నిజాం కళాశాల వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఈ నెల 21న ఓయూలో తలపెట్టిన యుద్ధభేరీ విజయవంతం చేయాలంటూ శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు యత్నించిన నిజాం కళాశాల విద్యార్థులను కళాశాల గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.




