హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తుల వివరాలను తన నివాసంలో మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.42.6 లక్షలు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 3305.02 లక్షలు, లోకేష్ ఆస్తుల విలువ రూ. 492.53 లక్షలు, బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ. 330.69 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 1992లో స్థాపించిన హెరిటేజ్ కంపెనీని పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.




