హైదరాబాద్: వరంగల్ జిల్లాలో మహబూబాబాద్,నెల్లికుదురు మండలాల్లో వేరు శనగ విత్తనాల కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లోని రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. విత్తనాలు ఇవ్వాలంటూ రైతులు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాధోడ్ పాల్గొన్నారు.




