Thursday, 5 November 2026

తెలంగాణను ఎవ్వరూ అడ్డుకోలేరు : శంకర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16  : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. శంకర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి తీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. తెలంగాణ ప్రక్రియ నిలిచిపోయిందని కొందరు సీమాంధ్ర నేతలు పనిగట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియ నిచిపోలేదని అన్నారు. దీనిపై సీమాంధ్ర నేతలకు అపోహలు, అనుమానాలు ఉంటే తన బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీల జన్మదినంనాటి కల్ల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. సీమాంధ్ర నేతల కుట్రపూరిత వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు, నమ్మవద్దని అన్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని శంకర్‌రావు పిలుపునిచ్చారు. వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతారని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్‌ రాజధాని అని ఆయన అన్నారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారుతప్ప హైదరాబాద్‌ లేని రాష్ట్రం వద్దని అన్నారు. సీమాంధ్ర నేతలు తమ రాజధానిని  ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారో అది వారి ఇష్టమని హైదరాబాద్‌  మాత్రం తెలంగాణ ప్రజలదని అన్నారు. తెలంగాణపై నిర్ణయం సోనియాగాంధీదే ఫైనల్‌ అని అన్నారు. ఇచ్చిన మాటను సోనియా ఎప్పుడు తప్పలేదని శంకర్‌రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *